తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా
తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు,
అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర
సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం,సజీవంగా
ఉంచుకోవడం, నిత్య నూతనంగా ఉంచుకోవడం మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం!
అంతర్జాలంలో తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ e-
తెలుగు.
అంతర్జాలంలోనే కాక బయటి ప్రపంచంలో కూడా.... అంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర
వ్యవహారాల్లోనూ, నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంలో తెలుగు
భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు అందరికీ అనువైన ఆదివారం రోజున, అంటే
ఆగస్టు 28వ తేదీ ఉదయం తెలుగు బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
సమయం: ఆగస్ట్ 28, 2011 (ఆదివారం) ఉదయం 9 గంటలు
స్థలం మరియు కార్యక్రమం: తెలుగు లలిత కళాతోరణం వద్ద అందరం కలుసుకుని,
అక్కడి నుంచి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకూ "తెలుగు బాట" పేరిట తెలుగుకై
నడుద్దాం..
మాతృ భాషా ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు ఈ "తెలుగుకై నడక"లో
పాల్గొనాలని, మీ స్నేహితులను కూడా మీతో కలిపి భాషా చైతన్యం దిశగా అడుగులు
వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుకై నడుద్దాం, తెలుగు వాడుకను
ప్రోత్సహించాలని కోరుతున్నాం !
మీ బంధు మిత్రులకు తెలుగు బాట కార్యక్రమం గురించి తెలియజేసి, విశేష
సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన.
http://telugubaata.etelugu.org/
ఈ తెలుగుబాట కార్యక్రమము లో పాల్గొనుటకు ఎటువంటి రుసుములేదు , తెలుగు భాష
మీద అభిమానము, వ్యాప్తికి తెలుగు అభిలాష చాలును! మీకు తెలుగు బాట
కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి.
సమయా భావం వలన మీరు సమోదు చేసుకోన లేకపోయినా పరవాలేదు, ఆదివారం ౯ గంటలకు
తప్పకరండి
సంప్రదింపులు:
94944 66189
http://telugubaata.etelugu.org
support@etelugu.org
--
https://groups.google.com/d/msg/hyd-masti/GO9LYiFoudM/TKqvCCq2EbMJ
No comments:
Post a Comment